Vijayashanthi : దోపిడీకి చిరునామా తెలంగాణ
బీజేపీ సీనియర్ నేత విజయ శాంతి
Vijayashanthi : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఆచి తూచి తమ విలువైన ఓటు వేయాలని కోరారు. ట్విట్టర్ వేదికగా విజయ శాంతి స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
Vijayashanthi Comments Viral
తన జీవిత కాలంలో 25 ఏళ్ల పాటు రాజకీయానికే సరి పోయిందని పేర్కొన్నారు. ఏనాడూ తాను పదవులను కోరుకోలేదని స్పష్టం చేశారు. నిత్యం సంఘర్షణ కొనసాగుతూనే ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఏవీ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బిడ్డల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమకు ఏదో జరుగుతుందని ఆశించిన వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆరోపించారు విజయ శాంతి(Vijayashanthi ). తెలంగాణ ఉద్యమంతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు.
ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో అవినీతికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ గా మారిందని ఆరోపించారు విజయ శాంతి. ఏది ఏమైనా రాజకీయ పరంగా విభేదించినప్పటికీ అందరూ బాగుండాలని తాను కోరుకుంటానని స్పష్టం చేశారు విజయశాంతి.
Also Read : BJP Final List : అభ్యర్థుల ఎంపికపై బీజేపీ భేటీ