Vijayashanti : ప్రాంతేతర పార్టీలను ఆమోదించరు
ప్రముఖ నటి విజయశాంతి
Vijayashanti : ప్రముఖ నటి, బీజేపీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి(Vijayashanti) కీలక కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తెలంగాణలో సెటిలర్స్ అన్న భావన లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వారంతా ఎవరైనా సరే తెలంగాణ బిడ్డలేనని పేర్కొన్నారు. సెటిలర్స్ ప్రజల ప్రయోజనాలు, భద్రత కల్పించాల్సిన బాధ్యత సర్కార్ దేనని స్పష్టం చేశారు విజయ శాంతి.
Vijayashanti Comment
తర తరాలుగా పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది గతంలో కూడా వాస్తవ రూపం దాల్చిందన్నారు. ఇదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు విజయ శాంతి.
ప్రాంతేతర పార్టీలను , అక్కడి ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం మంచి పద్దతి కాదన్నారు . అందుకే ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి విరమించు కుందని పేర్కొన్నారు.
పార్టీల ప్రయోజనాలు వేరు… ప్రజా ప్రయోజనాలు వేరు. ఏ ప్రాంతం వారైనప్పటికీ, భారత జాతిగా.. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి.
కరోనా కష్ట కాలంలో ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వద్ద నిలిపి వేసిన సమయంలో తాను ఒప్పుకోలేదని పేర్కొన్నారు విజయ శాంతి.
Also Read : Suresh Kondeti : సంతోషం వేడుకలకు సర్వం సిద్ధం