Vijayashanti : కాషాయానికి షాక్ రాములమ్మ జంప్
కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రెడీ
Vijayashanti : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ జంప్ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ తరుణంలో ప్రముఖ నటి, బీజేపీ కీలక నాయకురాలిగా గుర్తింపు పొందిన విజయ శాంతి గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఉన్నట్టుండి ఆమె తిరిగి స్వంత గూటికి వెళ్లనున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మల్లు రవి ప్రకటించారు.
Vijayashanti May be Join in Congress
ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సికింద్రాబాద్ లో జరిగిన మోదీ సభలో కనిపించలేదు. దీంతో హస్తం గూటికి చేరడం ఖాయమై పోయింది. ఇదిలా ఉండగా ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేశారు విజయ శాంతి(Vijayashanti). బీఆర్ఎస్ ను కొట్టే సత్తా ఉన్న పార్టీపై ప్రజలు వెళ్లాలని పిలుపునిచ్చారు.
రాములమ్మ చేరికను ధ్రువీకరించారు మల్లు రవి. ఇదిలా ఉండగా పార్టీలో చేరబోయే విజయ శాంతికి కీలకమైన చోటు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ప్రచార కమిటీలో చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి దాకా ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు . గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. బీజేపీలోకి జంప్ అయ్యారు. తీరా ఆమెకు అక్కడ ప్రయారిటీ లేక పోవడంతో తిరిగి హస్తం వైపు చూశారు.
Also Read : Palvayi Sravanthi : పాల్వాయి స్రవంతి కంట తడి