Vikas Raj : షెడ్యూల్ ప్ర‌కారమే అసెంబ్లీ ఎన్నిక‌లు

ప్ర‌క‌టించిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్

Vikas Raj : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సిఇఓ) వికాస్ రాజ్. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త కొంత కాలంగా ఎన్నిక‌లు అప్పుడో ఇప్పుడో అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని రాజ‌కీయ పార్టీలు భావిస్తున్నాయి.

Vikas Raj Comment Viral

ఈ త‌రుణంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ వికాస్ రాజ్. తెలంగాణ రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ఎటువంటి మార్పు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఎప్ప‌టి లాగానే షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ ఏడాది లేదా వ‌చ్చే ఏడాది ప్రారంభంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

దీంతో ఎప్పుడు ఎన్నిక‌ల కోడ్ వ‌స్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అధికార పార్టీ ముందంజ‌లో కొన‌సాగుతోంది అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న విష‌యంలో. మొత్తం 119 సీట్ల‌కు గాను 115 సీట్ల‌ను డిక్లేర్ చేశారు సీఎం కేసీఆర్(KCR).

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిపక్షాలు కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఇంకా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు. దీంతో ఇవాళో రేపో ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే ఛాన్స్ ఉంది ఇవాళ వికాస్ రాజ్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను బ‌ట్టి చూస్తే.

Also Read : Congress MPs : అవును మేం ఓటు వేయ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!