PM Modi : గ్రామ స్వరాజ్యం దేశానికి ఆదర్శం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi : గ్రామ స్వరాజ్ తో దేశం పురోభివృద్ది సాధిస్తోందని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కొత్త మైలు రాళ్లను సాధించిందని చెప్పారు. వచ్చే జూలై 21న వచ్చే 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపు కోవాలని సూచించారు.
ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు వ్యాయామంలో పాల్గొనాలని ప్రధాన మంత్రి(PM Modi) కోరారు. గత ఎనిమిది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించామని చెప్పారు మోదీ.
పంచాయితీల ప్రజాస్వామ్య సాధికారత, సంక్షేమ పథకాల సంతృప్త కవరేజీకి , నీటిని పొదుపుగా వాడు కోవాలని సూచించారు. యోగా అన్నది మన జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు పీఎం.
దేశంలోని గ్రామాల సర్పంచ్ లకు మోదీ లేఖలు రాశారు. మీ అందరి సహకారం మరిచి పోలేనని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అనేక అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రత్యేకంగా.
యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని అనుసరించాలని కోరారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న పురాతన లేదా పర్యాటక ప్రదేశాన్ని లేదా వాటర్ ట్యాంక్ కు సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.
ఇతరులకు స్పూర్తి దాయకంగా నిలిచేలా తమ చిత్రాలు (ఫోటోలు) పంచు కోవాలని సూచించారు ప్రధాన మంత్రి(PM Modi) . ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఇవాళ యోగాను తమ రోజూ వారీ దిన చర్యలో భాగంగా మార్చుకున్నారని పేర్కొన్నారు.
రాబోయే యోగా దినోత్సవాన్ని మానవత్వం కోసం యోగా అనే పేరుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, యోగా, విద్య, నీటి సంరక్షణ అన్నది ముఖ్యమన్నారు.
Also Read : దీదీ ఆహ్వానం ఉద్దవ్ ఠాక్రే దూరం