Vinai Kumar Saxena : ఢిల్లీ ఎల్జీగా కొలువుతీరిన స‌క్సేనా

దేశ రాజ‌ధానికి 22వ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్

Vinai Kumar Saxena : దేశ రాజ‌ధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా ఖాదీ , విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మిష‌న్ (కేవీఐసీ) మాజీ చైర్ ప‌ర్స‌న్ విన‌య్ కుమార్ స‌క్సేనా గురువారం కొలువు తీరారు.

ఇవాళ ఎల్జీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. విన‌య్ కుమార్ స‌క్సేనాకు 64 ఏళ్లు. నాన్ బ్యూరోక్రాటిక్ , నాన్ డిఫెన్స్ నేప‌థ్యం నుండి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులైన మొద‌టి వ్య‌క్తి గా నిలిచారు స‌క్సేనా(Vinai Kumar Saxena) .

ఢిల్లీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి విప‌న్ సంఘీ చేత రాజ్ నివాస్ లో జ‌రిగిన సాధార‌ణ వేడుక‌లో కొత్త ఎల్జీగా స‌క్సేనా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అంత‌కు ముందు లెఫ్టినెంట్ గవ‌ర్న‌ర్ గా ఉన్న బైజ‌ల్ వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా రాజీనామా చేశారు.

దీంతో దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌క్సేనాను ఎంపిక చేశారు. ఇదిలా ఉండ‌గా స‌క్సేనా ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , కేబినెట్ మంత్రులు ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు.

బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ, ప‌ర్వేశ్ సాహిబ్ సింగ్ , ఢిల్లీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాం వీర్ సింగ్ బిధూరి , బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఈ స‌మావేశానికి హాజ‌రయ్యారు.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేష్ కుమార్ , ఢిల్లీకి చెందిన ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. కాగా విన‌య్ కుమార్ స‌క్సేనా మూడు ద‌శాబ్దాల పాటు ప్రైవేట్ రంగంలో ప‌ని చేశారు.

ఆరు సంవ‌త్స‌రాల పాటు కేంద్ర ప్ర‌భుత్వ ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మిష‌న్ కి నాయ‌క‌త్వం వహించారు. కాగా ఐదేళ్ల‌కు పైగా ఎల్జీగా ఉన్న బైజ‌ల్ ఢిల్లీ స‌ర్కార్ తో ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు.

Also Read : హింసోన్మాది ఎప్ప‌టికీ గాంధీ కాలేరు

Leave A Reply

Your Email Id will not be published!