Vinay Mohan Kwatra : వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ మీట్
వెల్లడించిన విదేశాంగ కార్యదర్శి
Vinay Mohan Kwatra : వచ్చే వారం భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ మీట్ ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని అధికారికంగా కేంద్ర విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన వివరాలు తెలిపారు. వచ్చే వారం నిర్వహించే ఈ సదస్సుకు ప్రపంచంలోని 120 దేశాలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
ఒక సెషన్ లో 10 నుంచి 20 దేశాలు పాల్గొంటాయని వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు లీడ్ సెషన్ లకు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆతిథ్యం ఇస్తారని స్పష్టం చేశారు. అంతే కాకుండా వచ్చే వారం ప్రత్యేకంగా వర్చువల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు కార్యదర్శి వినయ్ క్వాత్రా.
జనవరి 12 నుంచి 13 వరకు రెండు రోజుల పాటు ది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ను భారత్ నిర్వహించనుందని పేర్కొన్నారు. యూనిటీ ఆఫ్ వాయిస్ అండ్ యూనిటీ ఆఫ్ పర్పస్ అనే థీమ్ కింద దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది తప్పనిసరిగా గ్లోబల్ సౌత్ లోని దేశాలను ఒక చోట చేర్చి, వారి దృక్ఫథాన్ని , ప్రాధాన్యతలను మొత్తం శ్రేణి సమస్యలలో ఉమ్మడి వేదికపై పంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు వినయ్ క్వాత్రా(Vinay Mohan Kwatra).
ఇదిలా ఉండగా భారత దేశం మొదటిసారిగా జీ20 శిఖరాగ్ర గ్రూప్ కు అధ్యక్షత బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ శత విధాలుగా భారత్ వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచానికి ఉగ్రవాదం కాదు కావాల్సింది శాంతి అని కోరుతున్నారు.
Also Read : సత్య నాదెళ్లతో కేటీఆర్ ములాఖత్