Vishnu Vardhan Reddy Azharuddin : కాంగ్రెస్ పై ధిక్కార స్వ‌రం

జూబ్లీ హిల్స్ బ‌రిలో ఉంటా

Vishnu Vardhan Reddy Azharuddin : హైద‌రాబాద్ – దివంగ‌త కాంగ్రెస్ నేత పి. జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తూ వ‌చ్చారు. తాజాగా ఏఐఏసీసీ ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీ 45 మందితో రెండో జాబితా ఖ‌రారు చేసింది. అధికారికంగా ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించ‌డంతో అసంతృప్తుల జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి.

Vishnu Vardhan Reddy Azharuddin Issue Viral

జూబ్లీ హిల్స్ పై టికెట్ ఆశించి భంగ ప‌డిన విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి(Vishnu Vardhan Reddy) శ‌నివారం మీడియాతో మాట్లాడారు. పార్టీపై, కొంద‌రు నేత‌ల‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం త‌న తండ్రి , త‌న కుటుంబం ఎంతగానో కృషి చేస్తూ వ‌చ్చింద‌న్నారు. కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అన్నంత‌గా మారి పోయింద‌న్నారు.

అయితే ఖైర‌తాబాద్ సీటు ను త‌న చెల్లెలు విజ‌యా రెడ్డికి కేటాయించింది పార్టీ. అయితే ఒక్కో ఇంట్లో రెండు టికెట్లు ఇచ్చార‌ని, కొంద‌రు అయ్య‌ల‌కు, హాఫ్ టికెట్ గాళ్ల‌కు టికెట్ ఇచ్చారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి.

పార్టీ కోసం క‌ష్ట ప‌డ్డాన‌ని, జూబ్లీ హిల్స్ బ‌రిలో తాను నిల‌బ‌డ‌తానంటూ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా సెకండ్ లిస్టులో ఇక్క‌డ భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ కు కేటాయించింది.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ పాల‌న జ‌నం ఆవేద‌న

Leave A Reply

Your Email Id will not be published!