PM Modi : భారతీయ నిర్మాణంలో విశ్వకర్మలు – మోదీ
విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన (పీఎం వికాస్)
PM Modi Vishwakarma Yojana : విశ్వ కర్మలు నవ భారతానికి చెందిన సాంప్రదాయ కళాకారులని ప్రశంసలతో ముంచెత్తారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ యోజన (పీఎం వికాస్ ) ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24 లో ప్రకటించారు. సాంప్రదాయ ఉత్పత్తుల నాణ్యత, స్కేల్ , రీచ్ ను మెరుగు పర్చడం, వాటి విలువను పెంచేందుకు ఎంఎస్ఎంఈ తో ఏకీకృతం చేయడం ఈ పథకం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
శ్రామిక శక్తిలో నైపుణ్యం పెంపొందించడం, సాంప్రదాయ చేతిలో తయారు చేసిన చేతి వృత్తులపై దృష్టి పెట్టడం , గ్రామంలోని అట్టడుగు స్థౄయి కళాకారుల అభివృద్ది దేశ వృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం దీనిపై ప్రసంగించారు. బడ్జెట్ అనంతరం సీరీస్ లోని 12వ వెబ్ నార్ లో ప్రసంగించారు ప్రధానమంత్రి.
నైపుణ్యం కలిగిన హస్త కళాకారులు స్వావలంబన అనేది దేశానికి నిజమైన స్పూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. స్థానిక చేతి పనుల ఉత్పత్తిలో చిన్న కళాకారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని చెప్పారు నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన(PM Modi Vishwakarma Yojana) వారికి సాధికారత కల్పించడంపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందన్నారు.
నైపుణ్యం కలిగిన హస్త కళాకారుల స్వావలంబన దేశానికి సంబంధించిన నిజమైన స్పూర్తికి చిహ్నాలు అని కితాబు ఇచ్చారు. తమ ప్రభుత్వం అటువంటి వాటిని నవ భారత దేశానికి విశ్వ కర్మగా పరిగణిస్తుందని చెప్పారు నరేంద్ర మోదీ.
Also Read : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం – మోదీ