S Jai Shankar : అబుదాబిలో జై శంక‌ర్ ఆల‌య సంద‌ర్శ‌న‌

గ‌ల్ఫ్ దేశంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న

S Jai Shankar : భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) కీల‌క‌మైన వ్య‌క్తిగా మారారు. ప్ర‌స్తుతం మోదీ కేబినెట్ లో అత్యంత శ‌క్తివంత‌మైన మంత్రిగా పేరొందారు.

మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ అంటూ ప్ర‌త్యేకంగా పాకిస్తాన్ దేశ మాజీ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ చేత ప్ర‌శంస‌లు అందుకున్నారు. తాజాగా ఆయ‌న గ‌ల్ఫ్ దేశ‌మైన యూఏఈలో మూడు రోజుల టూర్ లో ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న హిందూ దేవాల‌యాన్ని జై శంక‌ర సందర్శించారు. భార‌త దేశానికి సంబంధించి విదేశాంగ మంత్రులు ఎవ‌రూ ఈ గుడిని ఇంత వ‌ర‌కు సంద‌ర్శించ లేదు.

జై శంక‌ర్ మొద‌టి మంత్రి కావ‌డం విశేషం. అబుదాబిలో చేప‌ట్టిన ఆల‌య నిర్మాణం గురించి ప్ర‌శంసించారు కేంద్ర మంత్రి. ఇందులో భార‌తీయుల కృషిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

55,000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లంలో ఈ ఆల‌యం రూపు దిద్దుకోనుంది. కాగా నిర్మాణంలో ఉన్న ఈ ఆల‌యం శాంతి, స‌హ‌నం, సామ‌ర‌స్యానికి ప్ర‌తీక అని పేర్కొన్నారు.

గ‌ణేష్ చ‌తుర్థి రోజు ఈ ప్ర‌సిద్ద‌మైన గుడిని సంద‌ర్శించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు జై శంక‌ర్. వేగవంత‌మైన పురోగ‌తిని చూసి సంతోషం క‌లుగుతోంద‌న్నారు కేంద్ర మంత్రి(S Jai Shankar).

ఇందులో పాలు పంచుకున్న ప్ర‌తి ఒక్క‌రిని పేరు పేరునా అభినందిస్తున్నానంటూ చెప్పారు. ఈ సంద‌ర్భంగా నిర్మాణంలో భాగ‌మైన బృందాన్ని, మ‌ద్ద‌తు దారుల‌ను, కార్మికుల‌ను ఆయ‌న క‌లుసుకుని మాట్లాడారు.

ఇదే స‌మ‌యంలో మంత్రి షేక్ న‌హ్యాన్ బిన్ ముబార‌క్ అల్ న‌హ్యాన్ ను కూడా క‌లుసుకున్నారు జై శంక‌ర్.

Also Read : మోదీకి పాకిస్తాన్ పీఎం థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!