Vivek Agnihotri : ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రికి కోపం వచ్చింది. ఆయన ఏకంగా నిత్యం సమాచార ఘనిగా భావించే వికీపీడియాపై నోరు పారేసుకున్నారు. దానిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
తాను తీసిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీని అది సినిమాయే కాదని కేవలం కల్పితంతో కూడిన కథనమని పేర్కొంది. దీంతో మనోడికి ఆగ్రహం తెప్పించింది.
తను తీసిన సినిమాకు సంబంధించిన వివరణను తప్పుగా పేర్కొన్నారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు వివేక్ అగ్ని హోత్రి(Vivek Agnihotri ). వివరణ సరిగా లేదని, పూర్తిగా అసంబద్దంగా ఉందంటూ ఆరోపించారు.
ఆన్ లైన్ ఎన్ సైక్లో పేడియా ఈ చిత్రాన్ని ఓ కల్పిత కథగా పేర్కొంది. దీనిపై దర్శక, నిర్మాత సీరియస్ గా స్పందించారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు వివేక్ అగ్నిహోత్రి.
ప్రియమైన వికీపీడియా అంటూనే మీరు ఆధారాలు లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందన్నాడు.
సమాచారం ఇచ్చే ముందు దేని గురించైనా ఒకటికి పది సార్లు పరిశీలించండి. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ను ప్రచురించండి అంటూ సూచించారు వివేక్ అగ్ని హోత్రి.
ఇదిలా ఉండగా వికీపీడియా ఈ చిత్రం గురించి కాశ్మీరీ హిందువుల వలస చుట్టూ కేంద్రీకతమై ఉన్న కల్పిత కథాంశాన్ని ప్రదర్శించింది అని పేర్కొంది.
1990 ల ప్రారంభంలో జరిగిన వలసలను ఒక మారణ హోమంగా చిత్రీకరిస్తుంది. ఈ భావన విస్తృతంగా సరికానిదిగా పరిగణించ బడుతుందని పేర్కొనడాన్ని తప్పు పట్టారు వివేక్ అగ్నిహోత్రి.
Also Read : నవీన్ యెర్నేని విడుదల చేసిన ‘దర్జా’ మూడో పాట