Vivek Brothers Lead : వివేక్ బ్రదర్స్ జోష్
ఎన్నికల్లో ముందంజ
Vivek Brothers Lead : కరీంనగర్ జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా చెప్పినట్టుగానే పూర్తి మెజారిటీ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక అన్నీ తానై వ్యవహరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను బరిలో ఉన్న కోడంగల్, కామారెడ్డి నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతుండడం విస్తు పోయేలా చేసింది.
Vivek Brothers Lead Viral
ప్రస్తుతం 119 నియోజకవర్గాలకు గాను 70కి పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ 30కి పైగా సీట్లలో లీడ్ లో ఉండగా భారతీయ జనతా పార్టీ 8 సీట్లలో ఎంఐఎం 4 సీట్లలో సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
విశాఖ సంస్థ తో పాటు వీ6 ఛానెల్ చైర్మన్ గడ్డం వివేక వెంకట స్వామి(Vivek Venkata Swami), వినోద్ వెంకట స్వామి బ్రదర్స్ గెలుపు దిశలా సాగుతున్నారు. ఈ సందర్బంగా గడ్డం వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఇల్లు కట్టుకుంటానని ప్రజలకు సేవలు అందజేస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య , మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, యశస్విని రెడ్డి , దాసరి సీతక్క లీడ్ లో కొనసాగుతుండడం విశేషం.
Also Read : Komati Reddy Brothers : అన్నదమ్ముల హవా