VK Sasikala : అన్నాడీఎంకే ఐసీయూలో ఉంది
శశికళ షాకింగ్ కామెంట్స్
VK Sasikala AIADMK : అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశి కళ షాకింగ్ కామెంట్స్ చేశారు. జయలలిత కాలంలో నెంబర్ 2గా అధికారాన్ని చెలాయించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అరెస్ట్ అయ్యింది. నాలుగు ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. తిరిగి తమిళనాడులో కాలు మోపింది. అన్నాడీఎంకే(VK Sasikala AIADMK) తనదని ప్రకటించింది. కోర్టు దెబ్బకు దూరమైంది. ఎన్నికల్లో పోటీ చేయనంటూ సంచలన ప్రకటన చేసింది. ఆ తర్వాత మళ్లీ తాను చేసిన ప్రకటన ఒట్టిదేనని ప్రకటించింది.
ఆమె మాటలు నమ్మలేమంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో అన్నాడీఎంకేలో అంతర్గత పోరు కోర్టు దాకా చేరింది. ఎడాప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య పార్టీ చీఫ్ ఎవరు ఉండాలనే దానిపై పోటీ పడ్డారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది.
ఈ మేరకు మాజీ సీఎం పళనిస్వామికే పగ్గాలు అప్పగించాలని ఆదేశించింది. ఈ తరుణంలో శనివారం కీలక వ్యాఖ్యలు చేసింది వీకే శశికళ. ప్రస్తుతం అన్నాడీఎంకే పరువు పోయిందని , అందుకే తాను రంగంలోకి దిగానని చెప్పారు.
జయలలిత వదిలి వేసిన పనులను తాను పూర్తి చేయాలన్నది కల అని, ఇదే తన అంతిమ లక్ష్యమని ప్రకటించింది వీకే శశికళ. తన కోసం కాక పోయినా తమిళనాడు ప్రజలు , వారి రక్షణ కోసం పార్టీ క్యాడర్ ఏకం కావాలని పిలుపునిచ్చింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీని కాపాడుకోలేక పోయారని మండిపడ్డారు. రాను రాను పార్టీని వీడుతున్న వారి సంఖ్య అధికం అవుతోందన్నారు.
Also Read : ఆత్మ పరిశీలన లేని కాంగ్రెస్ ప్లీనరీ