VK Singh : కార్గో ఆపరేషన్స్ నిలిపి వేశాం
విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టుల్లో
VK Singh : కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్(VK Singh) కీలక ప్రకటన చేశారు. ఏపీలోని విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టుల్లో డొమెస్టిక్ ఎయిర్ కార్గో సర్వీసులను నిలిపి వేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీనిని రాత పూర్వకంగా అందజేశారు. తిరుపతి ఎయిర్ పోర్టులో ఎయిర్ కార్గో రెగ్యులేటెడ్ ఏజెంట్ అభ్యర్థన మేరకు అవుట్ బౌండ్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్య కలాపాలను నిలిపి వేసినట్లు తెలిపారు.
VK Singh Said
అంతే కాకుండా అన్ని ఎయిర్ పోర్ట్ లలో కామన్ యూజర్ డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కార్య కలాపాలను నిలిపి వేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ణయం తీసుకుందన్నారు. దీని వల్ల విజయవాడ ఎయిర్ పోర్ట్ లో సైతం డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపి వేసినట్లు మంత్రి చెప్పారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి మాత్రం అన్ని కార్గో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. డొమెస్టిక్ ఎయిర్ కార్గోను స్వయంగా హాండిల్ చేస్తామంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ ను నిర్వహిస్తున్న ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. దీనిపై ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా కోరామన్నారు వీకే సింగ్.
Also Read : Kumbham Anil Kumar Reddy : కాంగ్రెస్ కు బై బీఆర్ఎస్ కు జై