Vote For Sure : ఓటు వజ్రాయుధం దానిని రక్షించు కోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఒక వేళ దానిని గనుక గుర్తించక పోతే తీవ్రంగా నష్ట పోతాం. మన భవిష్యత్తు బాగుండాలంటే, మన దేశం బాగు పడాలంటే, అభివృద్ది చెందాలంటే కేవలం ఓటు మాత్రమే మార్గమని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది. త్వరలో రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
Vote For Sure Viral
ఈ సందర్భంగా ఓటు పట్ల అవగాహన కల్పిస్తోంది. చైతన్యవంతం చేసే పనిలో పడింది. ఇప్పటికే 119 జిల్లాలలో 5కె రన్ నిర్వహించింది. దీనికి ఓట్ ఫర్ ష్యూర్(Vote For Sure) అని పేరు పెట్టింది. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టింది.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఓటు శాతం పెరగాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరింది. గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. కానీ ఈసారి పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం.
ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఓటు విలువైనదని, దానిని పదిలంగా కాపాడు కోవాలని, పని చేసే వారికి మాత్రమే తమ విలువైన ఓటును వేయాలని సూచించింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఓటు వేద్దాం..డెమోక్రసీని కాపాడు కుందామని పిలుపునిస్తున్నారు.
Also Read : Minister KTR : మేమే గెలుస్తం మాదే అధికారం