Akhilesh Dimple Yadav : ఓటు వేసిన అఖిలేష్..డింపుల్ యాద‌వ్

ప్ర‌జ‌లు అంతిమంగా త‌మ వైపు ఉన్నారు

Akhilesh Dimple Yadav  : ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మెయిన్ పురి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సోమ‌వారం స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న డింపుల్ యాద‌వ్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కూడా ఓటు వేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైన‌ద‌ని ప్ర‌తి ఒక్క‌రు వినియోగించు కోవాల‌ని డింపుల్ యాద‌వ్ కోరారు. ఓటు వేసిన అనంత‌రం అఖిలేష్ యాద‌వ్ , డింపుల్ యాద‌వ్(Akhilesh Yadav Dimple) మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కొలువు తీరిన యోగి బీజేపీ ప్ర‌భుత్వం రాచ‌రిక పాల‌న సాగిస్తోంద‌న్నారు. ఉద‌యం పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన వెంట‌నే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌డం మొద‌లు పెట్టార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దొడ్డిదారిన గెల‌వాల‌ని అనుకోవ‌డం స‌త్ సంప్ర‌దాయం కాద‌న్నారు.

కాషాయ దుస్తులు వేసుకున్నంత మాత్రాన యోగులు ఎలా అవుతారంటూ నిప్పులు చెరిగారు. యోగి కావాల‌ని ఖాకీల‌కు ఆదేశాలు ఇచ్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు డింపుల్ యాద‌వ్ , అఖిలేష్ యాద‌వ్.

బీజేపీ ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా ఇంకెన్ని అడ్డంకులు సృష్టించినా దివంగ‌త ములాయం సింగ్ యాద‌వ్ (నేతాజీ)ను మ‌రిచి పోర‌న్నారు. ఆయ‌న జీవిత‌కాలం బ‌హుజ‌నుల‌కు, పేద‌లు, సామాన్యుల‌కు మేలు చేసేందుకు కృషి చేశార‌ని ప్ర‌శంసించారు. నేతాజీ ఇవాళ భౌతికంగా లేక పోయినా మెయిన్ పురి ప్ర‌జ‌ల్లో ప్ర‌తి ఒక్క‌రిలో కొలువు తీరి ఉన్నార‌ని అన్నారు డింపుల్ యాద‌వ్.

ప్ర‌జ‌ల ఆశీర్వాదం త‌మ‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌న్నారు. దీనిని యోగి కాదు క‌దా మోదీ కూడా ఏం చేయ‌లేర‌న్నారు.

Also Read : యోగి ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగం

Leave A Reply

Your Email Id will not be published!