Vundavalli Arun Kumar : మార్గదర్శి కేసులో జగన్ సహకరించాలి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
Vundavalli Arun Kumar : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వమని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ మార్గదర్శికి వర్తిస్తుందో లేదో చెప్పాలని ఆయన కోరారు. మార్గదర్శి వ్యవహారాల్లో నిజాలు, వాస్తవాలు బయట పెట్టాలంటే ఏపీ ప్రభుత్వం , సీఎం జగన్ సహకరించాలని కోరారరు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Vundavalli Arun Kumar Comments
రాజ గురువుకు కోపం వస్తే పునాదులు కదులుదాయని చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందన్నారు. అందుకే ఆదిరెడ్డిన పరామర్శించేందుకు వచ్చి రామోజీ రావు గురించి ఏ మాత్రం ప్రస్తావించ లేదని సీరియస్ అయ్యారు ఉండవల్ల అరుణ్ కుమార్.
మరో కేసులో రామోజీ రావు తన చైర్మన్ అని ఇదే రాజాజీ అఫడివిట్ దాఖలు చేశారన్నారు. మార్గదర్శి రూల్ అతిక్రమించినా సరే తప్పు కాదని తేల్చేయండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ. ఏపీలో మార్గదర్శి ఆస్తులు అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు వాళ్ల దగ్గర ఉండాలి కానీ అవి లేవన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. న్యాయ వ్యవస్థ తీరు మారాలన్నారు.
Also Read : Daggubati Purandeswari : ఏపీలో పంచాయతీ నిధులు పక్కదారి
