Wagner Chief : ప్రిగోజిన్ వార్నింగ్ రష్యా అలర్ట్
దేశమంతటా సాయుధ బలగాల మోహరింపు
Wagner Chief : ఉక్రెయిన్ పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. భారీ నష్టం చవిచూసినా ఎవరి ఆదేశాలను పట్టించు కోవడం లేదు రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఎలాగైనా సరే లింగి పోవాల్సిందేనంటూ స్పష్టం చేశారు. మరో వైపు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఇద్దరి దేశాధినేతల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు వేలాది మందిని చని పోయేలా, లక్షలాది మందిని నిరాశ్రయులయ్యేలా చేసింది.
ఓ వైపు ఐక్య రాజ్య సమితితో పాటు పలు దేశాలు ముఖ్యంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నా వ్లాదిమీర్ పుతిన్ తగ్గేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. తనకు చెప్పేకంటే ముందు ఉక్రెయిన్ కు దొడ్డిదారిన మద్దతు ఇస్తున్న అమెరికా, యుకె, యూరప్ దేశాలకు చెప్పాలని ఇప్పటికే స్పష్టం చేశాడు పుతిన్.
ఇక ఉక్రెయిన్ లో చోటు చేసుకున్న వార్ పై ప్రత్యర్థిగా ఉన్నటువంటి క్రెమ్లిన్ శిబిరాల మధ్య రోజు రోజుకు శత్రుత్వం మరింత పెరిగింది. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. వాగ్నర్ సాయుధ తిరుగుబాటు గ్రూప్ కు చీఫ్ గా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్(Yevgeny Prigozhin) కారణమంటూ ఆరోపించింది రష్యా. ఈ మేరకు దేశమంతటా సాయుధ దళాలను మోహరించాలని రష్యా చీఫ్ పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్ పై దాడులు మరింతగా ప్లాన్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా ప్రపంచానికి కావాల్సింది యుద్దం కాదని శాంతి అని స్పష్టం చేశారు మోదీ.
Also Read : Opposition Comment : మారిన స్వరం విపక్షాల ఐక్యతా రాగం