Centre To Karnataka HC : కావాలనే ట్విట్టర్ రూల్స్ ఉల్లంఘన
కర్ణాటక హైకోర్టుకు కేంద్రం వివరణ
Centre To Karnataka HC : మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పై బిగ్ షాక్ తగిలింది. ట్విట్టర్ ఉద్దేశ పూర్వకంగా చట్టాలను ధిక్కరించిందని కేంద్రం కర్ణాటక హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.
భారతీయ చట్టాలంటే సదరు సంస్థకు గౌరవం లేకుండా పోయిందని పేర్కొంది. గత కొంత కాలం నుంచి ధిక్కరిస్తూనే వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశ భద్రత విషయంలో సోషల్ మీడియా దిగ్గజానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉపసంహరణ, ఆదేశాలను నిరోధించడాన్ని వ్యతిరేకిస్తూ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ హైకోర్టులో(Centre To Karnataka HC) దాఖలు చేసింది.
ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన 101 పేజీల అభ్యంతరాల ప్రకటనలో చేసింది.
రాజకీయ ట్వీట్లను తీసీ వేయాలని కోరినట్లు ట్విట్టర్ ద్వారా చేసిన వాదనలపై, ధ్రవీకరించని ఖాతాలను బ్లాక్ చేయమని మాత్రమే కోరినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
పిటిషనర్ ఉద్దేశ పూర్వకంగా చట్టాలను పాటించకుండా ధిక్కరిస్తూనే ఉన్నారు. ప్రతివాది నెంబర్ 2 శ్రద్ద గల ఫాలో అప్ ప్రకారం 27 జూన్ 2022న షోకాజ్ నోటీసు జారీ చేసింది.
పిటిషనర్ తెలిపిన కారనాల కోసం ఇది అకస్మాత్తుగా అన్ని నిరోధించే ఆదేశాలను పాటించిందని పిటిషన్ ను కొట్టి వేయాలని కోరుతూ కేంద్రం తెలిపింది.
39 యూఆర్ఎల్ ల కోసం ఆర్డర్లను నిరోధించడాన్ని ట్విట్టర్ సవాల్ చేసింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 8న జరగనుంది. ప్రభుత్వ ఉపసంహరణ నోటీసుల వల్ల వాక్ స్వాతంత్రం దెబ్బ తింటుందని ట్విట్టర్ తన పిటిషన్ లో స్పష్టం చేసింది.
Also Read : తగ్గిన ఎస్బీఐ వృద్ధి అంచనా రేటు