PM Modi : యుద్ధం..క‌రోనా పెను ప్ర‌మాదం – మోదీ

పెను ప్ర‌భావాన్ని చూపింద‌ని కామెంట్

PM Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్, ర‌ష్యా దేశాల మధ్య కొన‌సాగుతున్న యుద్దం ప్ర‌పంచాన్ని తీవ్ర ప్ర‌భావితం చేస్తోంద‌ని ఆవేద‌న చెందారు.

బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మోదీ(PM Modi). వ్యాపార, వాణిజ్య రంగాల‌తో పాటు క‌రోనా దెబ్బ‌కు కూడా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని పేర్కొన్నారు పీఎం.

ముఖ్యంగా ఇంధ‌నం, కోకింగ్ కోల్ రంగాల్లో ర‌ష్యాతో స‌హ‌కారాన్ని పెంపొందించు కోవాల‌ని భార‌త్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంద‌న్నారు. యుద్దం, క‌రోనా ఈ రెండూ ఈ ప్ర‌పంచానికి ఎన్నో నేర్పాయ‌ని తెలిపారు.

ప్ర‌తి దేశం ఎంతో నేర్చు కోవాల్సి ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. దేశాల మ‌ధ్య అవ‌గాహ‌న‌, ఒప్పందం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ఉండాల‌న్నారు.

లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ర‌ష్యా లోని వ్లాడివోస్టాక్ లో జ‌రుగుతున్న 7వ ఈస్ట‌ర్న్ ఎక‌నామిక్ ఫోర‌మ్ ప్లీన‌రీ సెష‌న్ లో ప్ర‌సంగించారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

నేటి ప్ర‌పంచీక‌ర‌ణ ప్రంచంలో ఏదో ఒక ప్రాంతంలో జ‌రిగే సంఘ‌ట‌న‌లు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

దీనిని గ‌మ‌నించి సాధ్య‌మైనంత వ‌ర‌కు స్నేహ పూర్వ‌క‌మైన సంబంధాల‌ను కొన‌సాగించేందుకు ఆయా దేశాలు కృషి చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇంధ‌న కొర‌త అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌న్నారు. ఉక్రెయిన్ వివాదం ప్రారంభం నుండి దౌత్యం, సంభాష‌ణ‌ల మార్గాన్ని అవ‌లంభించాల్సిన అవ‌స‌రం ముఖ్య‌మ‌న్నారు.

ఈ వివాదానికి ముగింపు ప‌లికేందుకు శాంతియుతంగా జ‌రిగే ప్ర‌య‌త్నాల‌కు మేం మ‌ద్ద‌తు ఇస్తామని చెప్పారు మోదీ.

Also Read : పంజాబ్ లో జీతాలు ఇవ్వ‌లేని స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!