Joe Biden : ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి ముందస్తు కారణం లేకుండానే యుద్ధానికి సిద్దమైన రష్యాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది పెద్దన్న అమెరికా. ఇప్పటికే యూరోపియన్ దేశాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి.
పుతిన్ అనాలోచిత, అహంకార పూరిత ధోరణిని మాను కోవాలని కోరినా ఫలితం లేక పోయింది. ఇప్పటికే ఐక్య రాజ్య సమితో పాటు భారత ప్రభుత్వం రష్యా తన ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించింది.
అయినా రష్యా ఆయా దేశాల వినతులను బేఖాతర్ చేస్తూ పుతిన్ వార్ ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ చీఫ్ కూడా తామేమీ తక్కువ కాదని యుద్దానికి సై అంటున్నారు.
అయితే మిగతా దేశాలు తమకు సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ తరుణంలో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ బ్రిటన్ లో ఉన్న ఐదు ప్రధాన బ్యాంకులపై నిషేధం విధించారు.
దీంతో ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. మరో వైపు చైనా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. యూకే బాటలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడన్ (Joe Biden)రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఆ దేశానికి చెందిన రెండు అతి పెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇక అమెరికాతో పాటు జర్మనీ సైతం ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా బైడన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపించారు. ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తామని ప్రకటించారు.
Also Read : శాంతికి మంగళం యుద్ధానికి సిద్దం