Rakesh Tikait : న్యాయం అందే దాకా యుద్ధం – టికాయత్
నిప్పులు చెరిగిన ఎస్కేయు అగ్ర నాయకుడు
Rakesh Tikait : యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటన చోటు చేసుకుని ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన నిందితుడగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై భారతదేశ సర్వోన్నత న్యాయ స్థానం సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల ఎందుకు మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారంటూ ప్రశ్నించింది.
ఇదే సమయంలో వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జైలు ఊచలు లెక్క బెడుతున్నాడు ఆశిష్ మిశ్రా. దీనిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పంజాబ్ లో మూడు గంటలకు పైగా రాస్తారోకో చేపట్టారు.
ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్(Rakesh Tikait) స్పందించారు. ఘటన చోటు చేసుకుని ఏడాది పూర్తి కావస్తోంది. ఈ దేశంలో కొలువు తీరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ పట్ల, భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదని మండిపడ్డారు.
బాధిత రైతులు, కుటుంబాలు కేవలం న్యాయం కోసం ఆక్రోశిస్తాయని, ప్రశ్నిస్తాయని కానీ పోరాడే శక్తి వారికి ఉండదన్నారు. కానీ న్యాయం అందేంత దాకా తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు రాకేశ్ టికాయత్.
Also Read : జైళ్ల శాఖ డీజీ హత్య కేసులో ఉగ్ర కోణం