Warangal Heavy Rains : ఓరుగల్లును ముంచెత్తిన వాన
జన జీవనం అస్తవ్యస్తం
Warangal Heavy Rains : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీంతో భారీ ఎత్తున వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు నిండి పోగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది.
Warangal Heavy Rains Issue
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి వరంగల్(Warangal Heavy Rains) నగరం తల్లడిల్లింది. చిగురుటాకులా వణికింది. ఎంతకూ వర్షాలు తగ్గక పోవడంతో వరంగల్ నగరం ఇంకా వరదల్లోనే నిండి పోయింది. దీంతో ఎక్కడ చూసినా నీళ్లే చోటు చేసుకున్నాయి. దీంతో రెస్క్యూ సిబ్బంది బోట్లల్లో ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో ఓరుగల్లు పట్టణం అతలాకుతలంగా మారింది. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరంగల్ పట్టణంలోని 82 కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. కాలనీ వాసులు భయం భయంగా బతుకుతున్నారు. వరదల్లోనే చిక్కుకున్నారు. లబో దిబో మంటున్నారు.
ఇక హనుమకొండ లోని జవహర్ నగర్, ఊచమ్మ కుంట, భవానీ నగర్ , సమ్మయ్య నగర్, రాంనగర్ కాలనీలలో పూర్తిగా నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడి వాసులను బోట్లలో తరలించారు.
Also Read : AAP Water ATMs : దాహార్తి తీర్చుతున్న ఆప్ వాటర్ ఏటీఎంలు