VR Chaudhari : హాట్ లైన్ లో చైనాకు వార్నింగ్ – చౌద‌రి

ఎయిర్ ఫోర్స్ ఆర్మీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

VR Chaudhari :  ఎయిర్ ఫోర్స్ ఆర్మీ చీఫ్ వీఆర్ చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు భార‌త, చైనా దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య వివాదం నెల‌కొన్న త‌రుణంలో చౌద‌రి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌ధానంగా చైనీస్ కు చెందిన వాహ‌నం భార‌త గ‌గ‌న త‌లంలోకి వ‌చ్చింది.

ఒక ర‌కంగా ఇది స‌రిహ‌ద్దు వివాదానికి ఆజ్యం పోసింది. కొన్ని నిమిషాల పాటు ఘ‌ర్ష‌ణ పాయింట్ల మీదుగా ఎగిరింది. ఇదిలా ఉండ‌గా వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ (ఎల్ఓసీ) వెంట ఏదైనా గ‌గ‌న‌త‌ల ఉల్లంఘ‌న జ‌రిగినా భార‌త సైన్యం చైనాతో క‌మ్యూనికేట్ చేస్తుంద‌ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌద‌రి స్ప‌ష్టం చేశారు.

మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం చౌద‌రి చేసిన ఈ వ్యాఖ్య‌లు భార‌త దేశంతో పాటు చైనాలో ఆస‌క్తిని రేపింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న 90వ వైమానిక ద‌ళ వేడుక‌ల దినోత్స‌వం జ‌ర‌గ‌నుంది.

ఏదైనా గ‌గ‌తన త‌ల ఉల్లంఘ‌న జ‌రిగినా లేదా ఇత‌ర స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు చైనీయుల‌తో సంభాషించేందుకు ఇండియ‌న్ ఆర్మీ హాట్ లైన్ ను ఉప‌యోగిస్తామ‌ని చెప్పారు ఇండియ‌న్ ఆర్మీ చీఫ్ వీఆర్ చౌద‌రి(VR Chaudhari).

ప్ర‌త్యేకించి చైనీస్ వైమానిక ద‌ళ కార్య‌క‌లాపాల‌పై నిఘా ఉంచామ‌న్నారు. తాము రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ నెట్ వ‌ర్క్ ల ఉనికిని పెంచామ‌ని చెప్పారు. ఎక్క‌డా తాము త‌గ్గ‌డం లేద‌న్నారు వీఆర్ చౌద‌రి. ఎక్క‌డా తాము త‌గ్గ‌డం లేదని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

కాగా స్వ‌దేశీయంగా అభివృద్ది చేసిన ప్ర‌చంద్ లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్ మొద‌టి బ్యాచ్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స‌మక్షంలో భార‌త వైమానిక ద‌ళంలో చేరింది.

Also Read : జ‌ర్న‌లిస్టుల‌కు క్యారెక్ట‌ర్ స‌ర్టిఫికెట్లా

Leave A Reply

Your Email Id will not be published!