Mamata Banerjee : అల్లర్లు జరగకుండా చూడండి – దీదీ
బెంగాల్ లో 4 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్
Mamata Banerjee : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఉన్న సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు సీఎం మమతా బెనర్జీ.
మోహన్ భగవత్ నాలుగు రోజుల పాటు ఉంటారు. పశ్చిమ బెంగాల్ లోని కేషియార్ లో క్యాంప్ చేస్తారు. అక్కడ ఆర్ఎస్ఎస్ నిర్వహించే శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. మూడు వారాల పాటు ఈ శిబిరం కొనసాగుతుంది.
ఈ సందర్భంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని డీజిపిని ఆదేశించారు సీఎం. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈనెల 17 నుంచి 20 వరకు కేషియార్ లో ఉంటారు.
ఆయన పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సందర్బంగా ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee).
ప్రభుత్వం తరపున ఆర్ఎస్ఎస్ చీఫ్ కు స్వీట్లు, పండ్లు పంపండి. మనం అతిథులను స్వాగతిస్తున్నామని ఆయన భావించాలన్నారు. అతిగా వెలితే మోహన్ భగవత్ కు ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించారు దీదీ.
ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయండి. నిఘాను ముమ్మరం చేయండి. ఎవరినీ వదలకండి. కానీ మన సత్తా ఏమిటో, పోలీసుల విధులు ఎలా నిర్వహిస్తున్నారో వారికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు సిఎం.
పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో దీదీ(Mamata Banerjee) పరిపాలనా సమావేశాన్ని చేపట్టారు. కాగా ఆర్ఎస్ఎస్ 1800 శాఖలను కలిగి ఉంది.
Also Read : జ్ఞాన్వాపి మసీదు సర్వేకు 2 రోజులు గడువు