Rahul Gandhi : దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో పవర్ ను కోల్పోయింది.
ఇక్కడ కాంగ్రెస్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్, మణిపూర్ , పంజాబ్ , గోవా రాష్ట్రాలలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
ఈ తరుణంలో ప్రియాంక గాంధీ అన్నీ తానై వ్యవహరించిన యూపీలో గతంలో 7 సీట్లు ఉండగా ఈసారి 2 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీని కోలుకోలేని స్థితికి తెచ్చాయి ఈ ఎన్నికల్లో. దేశంలోని రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల గురించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ Rahul Gandhi) స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఎందుకు ఓడి పోయామన్న దానిపై తాము పరిశీలిస్తామన్నారు.
ఎన్నికల్లో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర పార్టీల వారిని కూడా ఆయన అభినందించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని దేశ ప్రయోజనాల కోసం పని చేస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాటలే ఆ పార్టీని కొంప ముంచాయి.
ఉత్తరాఖండ్ లో సైతం ఆ పార్టీ సీనియర్ హరీష్ రావత్ ఓడి పోయారు. ఇక సిద్దూ, చన్నీ కూడా ఓటమి బాట పట్టారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంపశయ్యపై ఉందన్నది మాత్రం వాస్తవం.
Also Read : మణిపూర్ లో బీజేపీ విక్టరీ సింగ్ కింగ్