Minister Sudhakar : కరోనాపై యుద్దం ఎదుర్కొనేందుకు సిద్దం
వెల్లడించిన మంత్రి కె. సుధాకర్
Minister Sudhakar : చైనాను కరోనాను వణికిస్తుండడంతో ముందు జాగ్రత్తగా భారత్ అప్రమత్తమైంది. ఈ తరుణంలో అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. దీంతో మంగళవారం కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్(Minister Sudhakar) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి కరోనా వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కొత్త వేరియంట్ వచ్చిందని తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. కోవిడ్ బీఎఫ్.7 వేరియంట్ ఎలా ఉంటుందనే దానిపై టెస్టులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, తాలూకాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగితే వాటిని తట్టుకునేందుకు కోవిడ్ రెస్పాన్స్ మాక్ డ్రిల్ లు ఉన్నాయని చెప్పారు. ఈ వేరియంట్ తక్కువ వైర్ లెన్స్ తో వ్యాపిస్తుందన్నారు. ప్రధానంగా వృద్దులు, పిల్లలు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏ మాత్రం అనుమానం వున్నా తమకు తెలియ చేయాలని కోరారు మంత్రి. అన్ని ఆస్పత్రులలో చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లను చేశామన్నారు కె. సుధాకర్. కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తోందన్న ప్రచారం ఉంది. కానీ తమ రాష్ట్రంలో అలాంటి ఆనవాళ్లు ఇంకా కనిపించ లేదన్నారు.
ఏది ఏమైనా ఎంతటి స్థితిలో ఉన్నా దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు.
Also Read : ప్రగ్యాపై కాంగ్రెస్ ఫైర్ బీజేపీ సెటైర్