Draupadi Murmu : అంబేద్కర్ కు రుణపడి ఉన్నాం – ముర్ము
ప్రజాస్వామ్యానికి భారత్ కేరాఫ్
Draupadi Murmu : ఇవాళ శుభదినం. మనందరం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్యానికి వేదిక ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటే. ఇందుకు మనమంతా గర్వపడాలని అన్నారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి(President Of India) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశం యావత్తు ఎల్లప్పటికీ ..సూర్య చంద్రులు ఉన్నంత కాలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు రుణపడి ఉంటుందన్నారు.
ఎందుకంటే ఆయన లేక పోతే ఇవాళ ఇంతటి మహత్తరమైన రాజ్యాంగం రూపు దిద్దుకుని ఉండేది కాదని పేర్కొన్నారు. సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉండాలని, స్వేచ్ఛ, సమానత్వం, పరస్పర గౌరవం , హక్కులు, బాధ్యతులు ఇలా ప్రతి ఒక్క దానిని పొందు పర్చిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు ద్రౌపది ముర్ము.
భారత దేశం ఎన్నో దేశాలకు స్పూర్తి దాయకంగా నిలిచిందన్నారు. ఇది మనందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు రాష్ట్రపతి. రాజ్యాంగం అమలు లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా మన దేశ ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నదని పేర్కొన్నారు ద్రౌపది ముర్ము(Draupadi Murmu). అన్ని వేళలా మనల్ని మనం సంస్కరించు కునేందుకు రాజ్యాంగమే మనకు మార్గదర్శిగా ఉంటుందన్నారు . ఎన్నో ఇబ్బందులు ఎదురైనా నేటికీ భారత దేశం స్వేచ్ఛకు, శాంతికి కేరాఫ్ గా ఉందన్నారు రాష్ట్రపతి.
జీ20 సదస్సు నిర్వహణ మన దేశ ప్రతిష్టను, నాయకత్వాన్ని పెంపొందించేలా చేసిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని చెప్పారు.
Also Read : రాజ్యాంగం ప్రజా దేవాలయం