Viruska : విరుష్క అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. విరాట్ అనుష్కల పాప ఫోటోల కోసం. ఉన్నట్టుండి ప్రేమికుల, అభిమానుల ఆశలపై వీరిద్దరు నీళ్లు చల్లారు. మా ఇద్దరి ఎన్ని కావాలంటే అన్ని ఫోటోలు తీసుకోండి. కాదనం, సహకరిస్తాం. కానీ మా పాపకు ప్రైవసీ కావాలి. ఆమె గోప్యతకు భంగం కలగకుండా పెంచాలని మేమిద్దరం డిసైడ్ అయ్యాం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మాపై ఎంత ప్రేముందో తెలుసు. అర్థం చేసుకోగలం. అందుకే మేము మిమ్మల్ని మనసారా కోరుతున్నాం.
మా అభ్యర్థనను మన్నించండి అంటూ కోరింది అనుష్క. మీ ఆదరాభిమానులు, ప్రేమానురాగాలు మమ్మల్ని కట్టి పడేస్తున్నాయి. మా ఈ జీవితంలోని ప్రతి సంతోష సమయాన్ని మీతో కలిసి పంచుకోవాలని అనుకుంటున్నాం. అయితే పేరెంట్స్ గా మాదో విన్నపం. ప్లీజ్ .. పాప జోలికి మాత్రం రాకండి అని కోరింది. అభిమానులకు అంతకంటే ఫోటోగ్రాఫర్లకు మా విజ్ఞప్తి అంటూ విరుష్క దంపతలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఇదే క్రమంలో సోషల్ మీడియాలో విరాట్ పాప ఇదేనంటూ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తమకు కలిగే పిల్లల్ని మీడియా కంట పడకుండా రాడికల్ భావజాలంతో పెంచుతానని అప్పట్లో అనుష్క శర్మ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇదిలా ఉండగా కోహ్లి తనకు పాప పుట్టిందని చెబుతూనే, పాప ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ ట్విట్టర్ వేదికగా కోరారు. ఇదిలా ఉండగా పాప, తల్లి ఆస్పత్రిలో క్షేమంగానే ఉన్నారని తెలిపారు.
No comment allowed please