AAP vs Delhi LG : బస్సులు మేం కొనుగోలు చేయలేదు
స్పష్టం చేసిన ఆప్ ఢిల్లీ ప్రభుత్వం
AAP vs Delhi LG : ఢిల్లీ ప్రభుత్వం 1,000 బస్సులను కొనుగోలు చేసిందని, దీని కొనుగోలులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఇందుకు సంబంధించి ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఆదివారం కోలుకోలేని షాక్ ఇచ్చారు.
ఇప్పటికే మద్యం పాలసీ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించారు. దీంతో సోదాలు చేపట్టింది. డిప్యూటీ సీఎం సిసోడియా తో పాటు 14 మంది ఉన్నతాధికారులపై అభియోగాలు మోపింది.
ఈ తరుణంలో బస్సుల కొనుగోలులో సైతం స్కాం ఉందంటూ వెంటనే విచారణ చేపట్టాలంటూ ఎల్జీ సీబీఐకి సిఫారసు చేశారు. దీనికి ఓకే చెప్పారు ప్రభుత్వ కార్యదర్శి. ఇప్పటికే ఎల్జీ వర్సెస్ ఆప్ నడుస్తోంది.
ఈ తరుణంలో బస్సుల కొనుగోలుకు సంబంధించి విచారణకు ఆదేశించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది ఢిల్లీ ఆప్ ప్రభుత్వం. ఆ బస్సులను తాము కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా 1,000 లో ఫ్లోర్ బీఎస్ -4 , బీఎస్ – 6 బస్సుల కోసం జూలై 2019న బిడ్ చేపట్టారు. 2020లో జరిగిన మరో బిడ్ లో అవకతవకలు జరిగాయింటూ ఫిర్యాదులు వచ్చాయి.
తాజాగా విచారణకు ఆదేశించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP vs Delhi LG) అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే విషయం తెలుసు కోకుండా ఎల్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు.
ఆ బస్సులను తాము ఎన్నడూ కొనుగోలు చేయలేదన్నారు. టెండర్లు రద్దు చేశామని స్పష్టం చేశారు. సీబీఐ ప్రాథమిక విచారణను నమోదు చేసిందని, ఏడాది కిందట ఏజెన్సీ ఏమీ కనుక్కోలేక పోయిందని ఆరోపించారు.
ముందుగా సక్సేనా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Also Read : కేరళలో రాహుల్ కు జన నీరాజనం