Naveen Patnaik Modi : ప్ర‌తిప‌క్షాల‌తో పొత్తు పెట్టుకోం – సీఎం

నితీశ్ కుమార్ కు కోలుకోలేని దెబ్బ

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా విప‌క్షాలు ఏకం కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింగి. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు.

గురువారం ఒడిశా సీఎం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు. అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న బీజేపీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పొత్తు పెట్టుకోదంటూ ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. ఆయ‌న‌కు 76 ఏళ్లు. ప్ర‌స్తుతం సీఎం, పీఎంలు సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. మొద‌టి నుంచి ప్ర‌ధానితో, బీజేపీతో టచ్ లో ఉన్నారు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్. అయితే విప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని కోరుతూ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు సీఎం నితీశ్ కుమార్.

ఆ మేర‌కు ఆయ‌న ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో భేటీ అయ్యారు. ఇవాళ ప్ర‌త్యేకించి ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ తో ములాఖ‌త్ అయ్యారు. ఇదే క్ర‌మంలో ఒడిశా సీఎంను కూడా కలుసుకున్నా ఫాయిదా లేకుండా పోయింది నితీశ్ కుమార్ కు. త‌మ బంధం బీజేపీతోనే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్. ఒక ర‌కంగా నితీశ్ కు బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Leave A Reply

Your Email Id will not be published!