MK Stalin : తమిళనాడు గవర్నర్ మాకొద్దు – ఎంకే స్టాలిన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం
MK Stalin : దక్షిణాదిన సీఎంలు, గవర్నర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కేరళలో సీఎం పినరయ్ విజయన్ , గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ , గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య దూరం పెరిగింది.
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) , గవర్నర్ రవి మధ్య అగాధం ఏర్పడింది. ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన స్టాలిన్ గవర్నర్ పై నిప్పులు చెరిగారు.
తాజాగా గవర్నర్, డీఎంకే సర్కార్ కు మధ్య వార్ కొనసాగుతోంది. జీఎన్ రవి పూర్తిగా కేంద్రానికి తొత్తుగా మారారంటూ మండిపడ్డారు సీఎం ఎంకే స్టాలిన్. వెంటనే బర్తరఫ్ ను చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏజెంట్ లా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం సమర్పించారు డీఎంకే ఆధ్వర్యంలో. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లలకు గవర్నర్ రవి కావాలని జాప్యం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు స్టాలిన్(MK Stalin).
ఇప్పటి వరకు 20 బిల్లులకు పర్మిషన్ ఇవ్వలేదని, సంతకం చేయలేదంటూ ఆరోపించారు సీఎం. ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నించారు ఎంకే స్టాలిన్.
రాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్యగా ఉండాల్సిన గవర్నర్, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వ్యక్తి దానిని పాతర వేయడం మంచి పద్దతి కాదన్నారు తమిళనాడు సీఎం.
తమిళనాడుతో పాటు కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే ఆరోపించింది. సీఎం చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : అన్నింటికీ ‘డిజిటల్’ మంత్రమేనా