Lalan Singh PK : పీకే సర్టిఫికేట్ తమ పార్టీకి అక్కర్లేదు
జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్
Lalan Singh PK : ఐపాక్ చీఫ్, ప్రముఖ భారతీయ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ పార్టీపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. పీకే ఇచ్చే సర్టిఫికేట్ తమకు అవసరం లేదని స్పష్టం చేశారు జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్(Lalan Singh PK).
సీఎం నితీశ్ కుమార్ పాలనలో ఎంత అభివృద్ది జరిగిందో బీహార్ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. పీకే తన ప్రయోజనం కోసం పదే పదే మాట్లాడుతున్నారని ఆయనకు అంత సీన్ లేదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా నితీశ్ కుమార్ కు పేరుందన్నారు పార్టీ చీఫ్.
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూనే దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తరపున పని చేస్తున్నారంటూ రాజీవ్ రంజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాకుండా నిత్యం నీతి సూత్రాలు వల్లించే పీకే చేపట్టిన జన్ సురాజ్ ప్రచారానికి అన్ని కోట్ల నిధులు ఎలా వచ్చాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా దశాబ్ద కాలంగా బీహార్ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని ఎక్కడా అభివృద్ది అన్నది జరగడం లేదని సంచలన ఆరోపణలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఇదిలా ఉండగా పీకే చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. పీకే జేడీయూ పార్టీ మధ్య ఆధిపత్య పోరుకు కేరాఫ్ గా నిలిచింది.
పీకే ఇచ్చే సర్టిఫికేట్ కోసం తాము వేచి ఉండడం లేదన్నారు. ప్రస్తుతం జేడీయూ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : 200 రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతులు