BBC Chief Tim Davie : మాకు ఎలాంటి ఎజెండా లేదు – బీబీసీ
స్పష్టం చేసిన డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ
BBC Chief Tim Davie : ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ(BBC) కీలక ప్రకటన చేసింది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి మోదీ ది క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లను ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనిలో అంతా అవాస్తవాలు ఉన్నాయని, కావాలని మోదీ వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు చేసిన ప్రయత్నంగా కొట్టి పారేసింది కేంద్ర ప్రభుత్వం. అనంతరం సోషల్ మీడియాకు వార్నింగ్ ఇచ్చింది.
మోదీకి సంబంధించిన లింకులను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో మోదీకి సంబంధించిన డాక్యుమెంటరీ నిషేధంపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన కోర్టు స్వేచ్ఛను అడ్డుకోలేమంటూ స్పష్టం చేసింది. కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఈ తరుణంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ బీబీసీకి షాక్ ఇచ్చింది.
ఆ సంస్థకు చెందిన ఢిల్లీ , ముంబై ఆఫీసులలో మూడు రోజుల పాటు ఏకబిగిన సోదాలు జరిపింది. చివరకు ట్యాక్స్ లు సరిగా చెల్లించారా లేదా అన్న దానిపై దాడులు చేశామని ప్రకటించింది.
ఈ సందర్భంగా సిబ్బందికి చెందిన సెల్ ఫోన్లు , ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు తీసుకు వెళ్లింది. ఈసందర్భంగా బీబీసీ ఇవాళ కీలక ప్రకటన చేసింది. తమకు ఎలాంటి ఎజెండా లేదని ప్రకటించారు బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ(BBC Chief Tim Davie).
తాము ప్రపంచానికి గొంతుగా ఉండాలని అనుకుంటామని , తమకు ఎవరి పట్ల వ్యతిరేకత లేదా సానుకూలత ఉండదని స్పష్టం చేవారు.
Also Read : గవర్నర్ లేఖ ‘మాన్’ కన్నెర్ర