Supreme Court : లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు
నోట్ల రద్దు పై సుప్రీంకోర్టు ధర్మాసనం
Supreme Court : భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పరిమితులు ఏమిటో, తమకు ఉన్న అధికారాలు ఏమిటో ..అందుకు సంబంధించిన లక్ష్మణ రేఖ ఏమిటో కూడా స్పష్టంగా తెలుసు అని పేర్కొంది. నోట్ల రద్దు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నోట్లను ఎందుకు రద్దు చేశారనే దానిపై స్పష్టంగా విచారణ చేపడతామని ధర్మాసనం(Supreme Court) కుండ బద్దలు కొట్టింది. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇది షాక్ అని చెప్పక తప్పదు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉన్నట్టుండి నోట్ల ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది ధర్మాసనం.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తన్న ప్రభుత్వం ఇందులో కీలకమైన పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలుసన్న విషయం తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడింది. 2016లో కేంద్ర సర్కార్ రూ. 500, రూ. 1000 నోట్లను ఉన్నపళంగా రద్దు చేసింది. ఆ సమయంలో దేశంలో సంక్షోభం నెలకొంది.
జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. వృద్దులు, చిన్నారుల తల్లులు , పెద్దలు నానా రకాలుగా ఇక్కట్ల పాలయ్యారు. కొందరు బారులు తీరి నిలబడడంతో సొమ్మసిల్లి పడి పోయారు కూడా. ఇంకొందరు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదిలా ఉండగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
ప్రధానంగా రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఏదైనా అంశం వస్తే దానిని తేల్చాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుందన్నారు జస్టిస్ ఎస్ఏ నజీర్. నోట్ల రద్దు అంశంపై సమగ్రమైన అఫిడవిట్లు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.
Also Read : హిందీని ఒప్పుకోం కేంద్రంపై యుద్దం – స్టాలిన్