Aaditya Thackeray : షిండే వ‌ల్ల‌నే చిప్ ప్లాంట్ కోల్పోయాం

ఆదిత్యా ఠాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Aaditya Thackeray : మాజీ మంత్రి, శివ‌సేన యువ నాయ‌కుడు ఆదిత్యా ఠాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండేపై మండిప‌డ్డారు.

గుజ‌రాత్ లో చిప్ ప్లాంట్ ను కోల్పోయినందుకు సీఎందే బాధ్య‌త అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ మెగా ప్రాజెక్టు 160 అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు.

క‌నీసం ఈ ఒక్క‌టి మ‌న‌కు వ‌చ్చి ఉంటే 80,000 మంది నుంచి 1,00,000 మందికి పైగా ఉపాధి ల‌భించి ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌, పారిశ్రామిక‌వేత్త‌లను ఆక‌ట్టుకోలేక పోయింద‌ని వీరి చేత‌కానిత‌నం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగిందంటూ ఫైర్ అయ్యారు ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray).

భార‌త దేశం మొద‌టి సెమికండ‌క్ట‌ర్ ప్లాంట్ కోసం గుజ‌రాత్ రూ. 1.54 ల‌క్ష‌ల కోట్ల వెంచ‌ర్ ను చేజిక్కించు కుంద‌ని విరుచుకుప‌డ్డారు.

మైనింగ్ లో దిగ్గ‌జ కంపెనీ అయిన వేదాంత‌, తైవాన్ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ దిగ్గ‌జ సంస్థ ఫాక్స్ కాన్ లు గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో సంయుక్తంగా ప్లాంట్ ను నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్నాయి.

ప్లాంట్ ఏర్పాటుపై దేశంలోని రెండు రాష్ట్రాలు పోటీ ప‌డ్డాయి. వాటిలో గుజ‌రాత్ ఒక‌టి కాగా మ‌రొక‌టి మహారాష్ట్ర‌. చివ‌ర‌కు గుజ‌రాత్ ప్లాంట్ ను ఎగరేసుకు పోయింది.

దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray). ఇదంతా సీఎం, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ల చేత‌కాని త‌నం వ‌ల్ల ఇలా జ‌రిగిందంటూ ఆదిత్యా ఠాక్రే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తాము ఉన్న స‌మ‌యంలో ప్రాజెక్టు మ‌రాఠాకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశామ‌ని కానీ సీఎం, ఫ‌డ్న‌వీస్ నిర్వాకం వ‌ల్ల రాలేక పోయింద‌న్నారు.

Also Read : ఫ‌డ్నవీస్ భార్య‌పై అనుచిత కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!