OM Birla Speaker : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం – ఓం బిర్లా
కెన్యా డిప్యూటీ ప్రెసిడెంట్ తో భేటీ
OM Birla Speaker : గ్లోబల్ సౌత్ ఎందుర్కొంటున్న ఆందోళనలను జీ20 ఫ్రేమ్ వర్క్ లో చేర్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు భారత దేశానికి చెందిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్పీకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఓం బిర్లా కెన్యా డిప్యూటీ ప్రెసిడెంట్ రిగతి గచాగువాను కలిశారు.
కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఉగ్రవాదం పెన వేసుకు పోయిందని ఇదే ప్రధాన సవాల్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా(OM Birla Speaker). శాంతి, అభివృద్ది కోసం పని చేయాలని ఇదే సమయంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న టెర్రరిజం పోరాడేందుకు అన్ని దేశాలు సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
లేక పోతే శాంతికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత దేశం జీ20 గ్రూప్ నకు మొదటిసారి నాయకత్వం వహిస్తోందన్నారు. ఇది నరేంద్ర మోదీ నాయకత్వానికి, పరిపాలనా దక్షతకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఐక్యరాజ్య సమితిలో భారత దేశం, కెన్యా సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రపంచ వేదికలలో రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కోసం పిలుపునిచ్చారు. జీ20 ప్రత్యేకతను, ప్రాధాన్యత గురించి కూడా ఇద్దరూ చర్చించారు. యావత్ ప్రపంచంలోని దేశాలన్నీ ఒకే సమస్యలను , సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు స్పీకర్ ఓం బిర్లా(OM Birla Speaker). ముందుగా వాటిని పరిష్కరించేందుకు భారత్ ఫోకస్ పెట్టిందన్నారు.
Also Read : రిమోట్ ఓటింగ్ సిస్టంపై ఆగ్రహం