Rahul Gandhi : మానవీయ స్పర్శ లేక పోతే మనజాలం
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ
Rahul Gandhi : భారత దేశం ప్రస్తుతం ప్రమాదంలో పడింది. రాజ్యాంగానికి మెల మెల్లగా తూట్లు పొడిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కులం , మతం , విద్వేషాల పేరుతో కొన్ని శక్తులు అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాషింగ్టన్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తనకు తెలిసింది ఒక్కటే ప్రజలంతా బాగుండాలని. కానీ మిగతా వాళ్లు ఓట్ల కోసం, అధికారం కోసం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కానీ తాను పట్టించుకోనని అన్నారు. వాళ్లు నన్ను పప్పు అని పిలిచారు. రాజకీయాలకు పనికి రాడంటూ ఎద్దేవా చేశారు. కానీ ఎవరు పప్పు అనేది ప్రజలు గుర్తించారని అన్నారు. దేశం అంటే మనుషులే కాదు మట్టి కూడా గుర్తిస్తే మంచిదన్నారు.
మతం పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ దేశానికి ఏం కావాలన్నది ప్రస్తుత ప్రభుత్వానికి తెలియదన్నారు. వాళ్లకు వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, దేశానికి చెందిన వనరులను అప్పగించడం మాత్రమే తెలుసన్నారు. భారత దేశానికి మతం కాదు కావాల్సింది మానవత్వం కావాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.
Also Read : Brij Bhushan Sharan Singh