A Raja : మాకు స్వ‌యం ప్ర‌తిప‌త్తి కావాలి – రాజా

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన డీఎంకే ఎంపీ

A Raja : త‌మిళ‌నాడు డీఎంకే ఎంపీ ఏ. రాజా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. త‌మిళ‌నాడుకు స్వ‌యం ప్ర‌తిపత్తి కావాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

త‌మిళ‌నాడును తాము పాలిస్తున్నామ‌ని అహంకారంతో దీనిని కోర‌డం లేద‌ని చె్పారు. గ‌తంలో డీఎంకే ప్ర‌త్యేక త‌మిళ‌నాడు డిమాండ్ ను విర‌మించుకుంద‌ని స్ప‌ష్టం చేశారు.

కానీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి స్వ‌యం ప్ర‌తిప‌త్తి కావాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు ఎంపీ ఏ. రాజా(A Raja).

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌కు దిశా నిర్దేశం చేసి రాష్ట్ర భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసిన మ‌హ‌నీయుడు , త‌త్వ‌శాస్త్ర పితామ‌హుడు పెరియార్ మ‌ర‌ణించేంత దాకా ప్ర‌త్యేక త‌మిళ‌నాడు కావాల‌ని కోరిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు.

మా నాయ‌కుడు , ప్ర‌స్తుత త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా అన్నాదురై మార్గంలో వెళుతున్నారని పేర్కొన్నారు. పెరియార్ మార్గం కంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఒక్క‌టే కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మొత్తంగా డీఎంకే ఎంపీ చేసిన కామెంట్స్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు రేపాయి. మ‌రో వైపు దేశ రాజ‌కీయాల‌లో సైతం హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇదిలా ఉండ‌గా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది.

ఇందులో భాగంగా త‌మిళ‌నాడు, కేంద్రం మ‌ధ్య ఉప్పు , నిప్పు లాగా సంబంధాలు నెల‌కొన్నాయి. త‌మ‌కు అటామ‌న‌స్ ఇస్తే తామే స్వ‌యంగా పాలించుకుంటామ‌నే ఆలోచ‌నలో డీఎంకే ఉండ‌డం విశేషం.

ఇప్ప‌టికే దేశంలో ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేసింది బీజేపీ(BJP).

Also Read : వాళ్ల‌ను క్ష‌మిస్తా ప్ర‌తీకారం తీర్చుకోను

Leave A Reply

Your Email Id will not be published!