Telangana Governor : పుస్తకాల్లో చదివాం ఇప్పుడు చూస్తున్నాం
రాష్ట్రపతి గురించి గవర్నర్ కామెంట్స్
Telangana Governor : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చిన్నప్పుడు రాష్ట్రపతి అంటే ఎలా ఉంటారో అని అనుకునే వాళ్లమన్నారు. కానీ పుస్తకాల్లో రాష్ట్రపతి ఎవరు అనేది తెలుసుకునే వాళ్లమని చెప్పారు. కానీ గతంలో పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు దగ్గరుండి రాష్ట్రపతిని చూస్తున్నామని పేర్కొన్నారు.
మంగళవారం కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తమిళి సై సౌందర్ రాజన్(Telangana Governor) మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సంస్కారం అలవర్చుకోక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
చిన్నప్పటి నుంచే చరిత్రను , సంస్కృతిని, దేశ నాగరికతను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తమిళి సై సౌందర రాజన్. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు గవర్నర్. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ల జీవిత చరిత్రలు చదివితే మనం ఎలా బతకాలో తెలుస్తుందని అన్నారు రాష్ట్ర గవర్నర్.
ఇదిలా ఉండగా కేశవ్ మెమోరియల్ సంస్థల విద్యార్థులు చాలా అదృష్టవంతులు అని ప్రశంసించారు. ఎందుకంటే స్వయంగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి పౌరురాలు రాష్ట్రపతి మీ ముందుకు వచ్చారని అన్నారు తమిళి సై సౌందర రాజన్. చెంచులు, గిరిజనులతో మాట్లాడారని ప్రెసిడెంట్ మనందరికీ ఆదర్శనీయమన్నారు గవర్నర్(Telangana Governor).
విలువైన కాలాన్ని గుర్తించిన వాళ్లే జీవితంలో విజేతలుగా నిలుస్తారని అన్నారు.
Also Read : సంస్కారం లేక పోతే సర్వ నాశనం