DK Shiva Kumar : ఇది ప్ర‌జా విజ‌యం – డీకే శివ‌కుమార్

స్వంతంగానే అధికారంలోకి వ‌స్తాం

క‌ర్ణాట‌కలో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ 10కి పైగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. మొత్తం 224 సీట్ల‌కు గాను అన్ని సీట్ల‌కు సంబంధించి ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే రెండో రౌండ్ కూడా పూర్త‌య్యాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ 113 సీట్లు దాటాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ 140 సీట్లు వ‌స్తాయ‌ని ముందే చెప్పినా ప్ర‌స్తుతం క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి 117 నుంచి 118 సీట్ల మ‌ధ్య ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

ఈ త‌రుణంలో ముందే చెప్పిన‌ట్లు కాంగ్రెస్ ఊహించ‌ని రీతిలో పుంజుకుంది. ప్ర‌ధానంగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం సీఎం ఎవరు అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌నా లేక డీకే శివ‌కుమార్ అన్న‌ది తేలాల్సి ఉంది. ఇదంతా పార్టీ హైక‌మాండ్ చూసుకుంటుంది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంతోషం నెల‌కొంది. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో పోలింగ్ ఫ‌లితాల స‌ర‌ళిని. బెంగ‌ళూరులోని పార్టీ ఆఫీసులో , ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో సంబురాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్భంగా కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ఊహించిందే జ‌రిగింద‌న్నారు.

డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ ను ప్ర‌జ‌లు ఒప్పుకోలేద‌ని ఈ తీర్పుతో వెల్ల‌డైంద‌ని పేర్కొన్నారు. తాము ముందు నుంచి పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏం చేయాల‌నే దానిపై పార్టీ హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!