Madhya Pradesh CM : లవ్ జిహాద్ పై చట్టం తీసుకు వస్తాం
మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన
Madhya Pradesh CM : దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తోంది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ లవ్ జిహాద్ ను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
ఆయనకు మద్దతుగా నిలిచారు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Madhya Pradesh CM). ఇదిలా ఉండగా గిరిజన దిగ్గజం తాంతియా భిల్ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఇది ప్రేమ కాదని లవ్ జిహాద్ పేరుతో మరో ఉగ్రవాదానికి తెర తీశారని ఆరోపించారు శివరాజ్ సింగ్ చౌహాన్. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన శ్రద్ధా వాకర్ ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటనను ఉటంకిచారు సీఎం. అంతే కాకుండా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో తాజాగా చట్టం తీసుకు వస్తామని ప్రకటించారు శివరాజ్ సింగ్ చౌహాన్.
తమ రాష్ట్రంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలను 35 ముక్కలుగా చేసేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇది ప్రేమ పేరుతో జిహాద్ ను సహించ బోమన్నారు. మధ్యప్రదేశ్ గడ్డపై ఇది జరగదన్నారు.
ముస్లిం పురుషులను తమ మత మార్పిడిని నిర్ధారించు కునేందుకు హిందూ మహిళలను ఉద్దేశ పూర్వకంగా సంబంధాల్లోకి రప్పిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్.
ఎవరు ఇబ్బందులు కలిగించినా తాము ఒప్పుకోబోమంటూ స్పష్టం చేశారు.
Also Read : విద్వేష రాజకీయాలు రక్షించవు – రాహుల్