Ashok Gehlot : హామీలను నెరవేర్చాం అధికారంలోకి వస్తాం
96 శాతం పూర్తి చేశామన్న అశోక్ గెహ్లాట్
Ashok Gehlot : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని బీజేపీ ఫోకస్ పెట్టింది. మరో వైపు ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దూరంలో లేమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
135 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కేవలం రాజస్థాన్ , హిమాచల్ ప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. రాజస్థాన్ లో ప్రస్తుతం ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్ మధ్య నువ్వా నేనా అన్న యుద్దం నడుస్తోంది.
ఇదిలా ఉండగా అశోక్ గెహ్లాట్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. వినూత్నమైన పథకాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం కీలక కామెంట్స్ చేశారు. గతంలో ఎన్నికల సందర్భంగా తాము 100 శాతం హామీలు ఇచ్చాం. తమ పాలనలో ఇప్పటి వరకు 96 శాతం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వివిధ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఏకైక రాష్ట్రం రాజస్థాన్ అని స్పష్టం చేశారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
తాము ప్రజల కోసం ఇంత కాలం పని చేశామని చెప్పారు. తమది ప్రజా మేనిఫెస్టోగా సీఎం అభివర్ణించారు. రాజస్థాన్ ప్రభుత్వం సున్నితమైన, పారదర్శకమైన , జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనను క్షేత్ర స్థాయిలో వాస్తవికంగా ఆచరణలోకి తీసుకు వచ్చిందని చెప్పారు. నాలుగేళ్ల కాలంలో 2,722 బడ్జెట్ ప్రకటనలకు గాను 2,549 ఆర్థిక అనుమతులు ఇచ్చామన్నారు.
Also Read : జమ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్