CM YS Jagan : ఆరు నూరైనా సరే పెన్షన్లు ఇస్తాం – జగన్
కేవలం వెరిఫికేషన్ మాత్రమే చేస్తున్నాం
CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో ఇస్తూ వస్తున్న పెన్షన్లను తీసి వేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. ఇదంతా కావాలని ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండించారు.
సీఎం స్వయంగా పెన్షన్ దారులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి ఏటా ఆడిట్ జరుగుతుందని, అందులో భాగంగా కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు జగన్ రెడ్డి(CM YS Jagan). ఇప్పటి వరకు ఇస్తున్న పెన్షన్లలో ఒక్కటి కూడా తీసి వేయడం జరదని స్పష్టం చేశారు.
ఇది కావాలని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు ఏపీ సీఎం. ఎప్పటి లాగే తిరిగి పరిశీలించడం జరుగుతుందని దీనిని సహృదయతతో అర్థం చేసుకోవాలని సూచించారు సందింటి జగన్ మోహన్ రెడ్డి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది జరుగుతుందన్నారు. ఆరు నూరైనా పెన్షన్లు ఇచ్చి తీరుతామని ప్రకటించారు సీఎం.
ఇంకా అవసరమైన వారికి, అర్హులైన వారు ఉంటే పరిశీలించి ఇవ్వడంం జరుగుతుందన్నారు. అర్హులైన వారిలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని తేల్చి చెప్పారు జగన్ రెడ్డి(CM YS Jagan). మొదటగా నోటీసులు ఇస్తారని, ఆ తర్వాత రీ వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు సీఎం. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా తాను ఊరుకో బోనంటూ హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తన బాధ్యత అని కుండ బద్దలు కొట్టారు ఏపీ సీఎం.
Also Read : సంస్కారం లేక పోతే సర్వ నాశనం