Amit Shah : జ‌న‌వ‌రి 2024లో రామ మందిరం తెరుస్తాం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్ల‌డి

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ పార్టీ ప‌దే ప‌దే రామ మందిరం స‌మ‌స్య‌ను లేవ‌నెత్తుతోంది. అంతే కాకుండా దానిని కావాల‌ని ఎన్నిక‌ల కోస‌మే ప్రారంభించ‌డం లేదంటూ ఆరోపించింది. దీంతో ఎప్పుడు తెరుస్తామ‌నే దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు అమిత్ షా.

ఈ మేర‌కు గురువారం త్రిపుర‌లో అమిత్ చంద్ర షా మీడియాతో మాట్లాడారు. జ‌న‌వ‌రి 1, 2024 న అయోధ్య లోని రామ మందిరంను తెరుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కేంద్ర మంత్రి.

రామ మందిరం నిర్మాణాన్ని కోర్టుల్లో అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీన‌ని, అందుకే నిర్మాణంలో ఆల‌స్యం జ‌రిగింద‌ని చెప్పారు అమిత్ షా. సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తిరిగి ఆల‌య నిర్మాణాన్ని ప్రారంభించార‌ని స్ప‌ష్టం చేశారు. అందుకే నిర్మాణంలో ఆల‌స్య‌మైంద‌ని, దీనికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణ‌మ‌ని ఆరోపించారు అమిత్ షా(Amit Shah).

ఈ సంద‌ర్భంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప్రారంభం కానున్నాయి. ఆరోజే రామ మందిరం ప్రారంభానికి నోచుకోనుంది. ఇదిలా ఉండ‌గా ఇదే బ‌ల‌మైన అస్త్రంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు బ‌లంగా మార‌నుంది. కాగా 1990లో జాతీయ ఎన్నిక‌ల శ‌క్తిగా ఆవిర్భ‌వించేందుకు ఆల‌య ఉద్య‌మాన్ని భుజానికి ఎత్తుకుంది బీజేపీ.

అదే పార్టీకి ఆల‌యాన్ని తెర‌వ‌డం ఒక మైలురాయిగా భావిస్తోంది. దీనినే ఎన్నిక‌ల అస్త్రంగా మార్చుకోనుంది బీజేపీ. దేశ వ్యాప్తంగా రామ మందిరం మ‌రోసారి ప్ర‌చార అస్త్రం కానుంద‌న్న‌మాట‌.

Also Read : దేశం కోసం ప్రేమ‌ను ఇవ్వండి – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!