Rahul Gandhi : అదానీ పెట్టుబడులను వ్యతిరేకిస్తాం
రాజస్థాన్ సీఎంకు రాహుల్ గాంధీ బిగ్ షాక్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కోలుకోలేని షాక్ ఇచ్చారు రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ కు. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజస్తాన్ సమ్మిట్ 2022కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ. 65,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందజేస్తామని చెప్పారు. ఇదే సమయంలో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్ట బోతున్న గౌతమ్ అదానీని ఆకాశానికి ఎత్తేశాడు సీఎం అశోక్ గెహ్లాట్.
ఇదిలా ఉండగా ముందు నుంచీ గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ, తదితర వ్యాపారవేత్తలను ప్రధానంగా టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. ఇదే క్రమంలో తమ పార్టీకి చెందిన సీఎం, ప్రభుత్వం తాను వ్యతిరేకించిన అదానీ తో జత కట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు రాహుల్ . దేశ వ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది.
బీజేపీ దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో(Bharat Jodo Yatra) పాల్గొన్న రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు అదానీ ఇన్వెస్ట్ మెంట్ ప్రకటనను ఎలా స్పందిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై ఆసక్తికరమైన రీతిలో సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ.
తాను వ్యాపారాలకు వ్యతిరేకం కాదని కానీ భారతీయ వ్యాపారాల గుత్తాధిపత్యానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. అదానీ రూ. 65 వేల కోట్లు ఇస్తానని ప్రకటించారు. దీనిని ఏ సీఎం కాదనరు. ఇది వాస్తవమన్నారు.
Also Read : రాహుల్ విమర్శ గెహ్లాట్ ప్రశంస