Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కే్జ్రీవాల్(Arvind Kejriwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంజాబ్ సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పంజాబ్ సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ ను ప్రశంసించారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు అద్బుతంగా ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు.
ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా తాము ఏ హామీలు ఇచ్చామో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉంటుందన్నారు.
ఈనెల 16న కొలువు తీరిన మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే తన వాట్సాప్ నంబర్ కు వీడియో లేదా మెస్సేజ్ పంపించాలని(Arvind Kejriwal) ప్రకటించారు.
కేవలం 10 మంది మంత్రులతో కేబినెట్ కొలువు తీరింది. సీఎం, పీఎం ఫోటోలు ఉండ కూడదని ఆదేశించారు. భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఎమ్మెల్యేలు సిఫారసులతో వస్తే సహించనంటూ హెచ్చరించారు. చండీగఢ్ లో ఉండవద్దని నియోజకవర్గాల్లో సేవలు చేయాలని స్పష్టం చేశారు సీఎం.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. సీఎం భగవంత్ మాన్ ప్రతి మంత్రికి ఓ టార్గెట్ పెడతారని, అది నెరవేరక పోతే ప్రజలు స్వచ్చందంగా అతడిని తొలగించే ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇది దేశంలోనే మొదటి సారి అని వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం నిజాయితీగా, అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
Also Read : మణిపూర్ సీఎం రేసులో ఖేమ్ చంద్