Jairam Thakur : ప్రజా తీర్పు శిరోధార్యం – జైరామ్ ఠాకూర్
గుర్రపు వ్యాపారం కొంప ముంచిందన్న కాంగ్రెస్
Jairam Thakur : ఇది ఊహించని పరిణామం. గుజరాత్ లో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్(Jairam Thakur) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాను శిరసా వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే ఆయన కీలక ప్రకటన చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా తమ ఎమ్మెల్యేలను రక్షించు కోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు జైరామ్ ఠాకూర్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడు గెలుస్తారో లేక ఎప్పుడు ఓటమి పాలవుతారో చెప్పడం కష్టమన్నారు.
ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మేరకు తమను వద్దని అనుకున్నారు. ఓట్ల ద్వారా తమ తీర్పును ప్రకటించారని అన్నారు. అయితే మేం ఎక్కడికీ వెళ్లలేదు. ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని అంగీకరిస్తామని స్పష్టం చేశారు జైరామ్ ఠాకూర్(Jairam Thakur).
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు కీలక నేతలు, మంత్రులు, సీనియర్లు ప్రచారం చేశారు పెద్ద ఎత్తున .
కానీ తమ పార్టీని గట్టెక్కించ లేక పోయారు. అయితే ఈసారి గతంలో కంటే ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుందుకు థ్యాంక్స్ చెప్పారు జైరామ్ ఠాకూర్. ప్రధానమంత్రి మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : గుజరాత్ ఓట్లతో ఆప్ ఇక జాతీయ పార్టీ