Sanjay Raut : ఎన్నిక‌ల్లో శివ‌సేన‌ స‌త్తా ఏమిటో చూపిస్తాం

ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్

Sanjay Raut : తిరుగుబాటు ప్ర‌క‌టించి వెన్నుపోటు పొడిచి కొలువుతీరిన శివ‌సేన ఎమ్మెల్యేల స‌త్తా ఏమిటో రాబోయే ఎన్నిక‌ల్లో తేలుతుంద‌న్నారు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut).

మ‌రాఠా యోధుడు స్థాపించిన పార్టీకి ద్రోహం చేసిన వారిని మ‌రాఠా ప్ర‌జ‌లు ఎన్న‌టికీ క్ష‌మించ‌ర‌ని అన్నారు. మంగ‌ళ‌వారం సంజ‌య్ రౌత్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

మేం ఒంట‌రిగానే 100 సీట్లు గెల‌వ‌గ‌ల‌మ‌ని మా పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న‌తో చెప్పార‌ని తెలిపారు. ఏక్ నాథ్ షిండే, భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌లిసి ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం మూణ్ణాళ్ల ముచ్చేట‌న‌ని పేర్కొన్నారు.

ఆరు నెల‌లు ఉంటే క‌ష్ట‌మ‌న్నారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సంజ‌య్ రౌత్. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని అన్నారు.

ఎవ‌రు గెలుస్తారో లేదా ఎవ‌రు ఓడి పోతారో తేలుతుంద‌న్నారు. అధికారం ఉంది క‌దా అని మిడిసి ప‌డితే చివ‌ర‌కు పాతాళ లోకానికి వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు సంజ‌య్ రౌత్.

ఇదిలా ఉండ‌గా శివ‌సేన నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ప్ర‌క‌టించాడు. ఏకంగా బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు.

ఇదే స‌మ‌యంలో త‌మ‌దే అస‌లైన శివ‌సేన పార్టీ అని కూడా ప్ర‌క‌టించాడు. సోమ‌వారం అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల ప‌రీక్ష‌లో సైతం గెలుపొందారు.

దీంతో మాట‌ల యుద్దం మ‌రింత ముదిరింది. ఇదిలా ఉండ‌గా శివ‌సేన పార్టీని పూర్తిగా నాశ‌నం చేసేందుకే సంజ‌య్ రౌత్(Sanjay Raut) ఉన్నారంటూ రెబల్ శివ‌సేన ఎమ్మెల్యేలు ఆరోపించారు.

Also Read : అఖిలేష్ పై మ‌హిళా క‌మిష‌న్ సీరియస్

Leave A Reply

Your Email Id will not be published!