Modi : ఇది ఊహించని పరిణామం. ఇప్పటికే శ్రీలంక (Sri Lanka) తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో (Crisis) కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ అధ్యక్షుడు ప్రతిపక్షాలను సర్కార్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చాడు.
ఈ తరుణంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)తో పలువురు ముఖ్య కార్యదర్శులు సమావేశమయ్యారు. 26 మంది పాల్గొన్న వారంతా డేంజరస్ బెల్స్ గురించి ప్రస్తావించారు.
ఇదే పనిగా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో భారత్ శ్రీలంక (Sri Lanka) లాగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందంటూ విన్నవించారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఈ మారథాన్ సమావేశంలో పలు రాష్ట్రాలు ప్రకటించిన ప్రజాకర్షక పథకాలు ఆర్థికంగా నిలకడ లేనివని, శ్రీలంక దారిలోనే వాటిని తీసుకు వెళ్లవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ప్రధాన మంత్రి మోదీ (Modi)నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పేదరికాన్ని సాకుగా చూపుతూ అమలు చేస్తున్న పథకాలకు మంగళం పాడాలని సూచించారు. ఇలాగే కొనసాగిస్తూ పోతే భారత్ (India) కు ప్రమాదమని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కరోనా సమయంలో ఎలా పని చేశారో ఇకనుంచి కూడా అలాగే చేయాలని ఈ సందర్భంగా మోదీ (Modi) సూచించారు. తమ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేని వాటితో సహా ప్రభుత్వ విధానాలలో లొసుగులను సూచించాలని కూడా కోరారు.
Also Read : తేజస్వి సూర్య సంచలన కామెంట్స్